కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని వినతి
గాంగ్‌టక్ : సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమంగ్ సోమవారం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యను కలుసుకుని, తదుపరి ప్రభుత్వం ఏర్పాటుకు వీలుగా తమ శాసనసభా పక్షం నేతగా తనను ఎన్నుకుంటూ కొత్తగా ఎన్నికైన సిక్కిం క్రాంతికారి మోర్చా (ఎస్‌కెఎం) ఎంఎల్‌ఎలు ఆమోదించిన ఒక తీర్మానాన్ని అందజేసినట్లు అధికారి ఒకరు వెల్లడించారు. రాజ్ భవన్‌లో గవర్నర్‌తో సమావేశం సమయంలో తమంగ్ వెంట కొత్తగా ఎన్నికైన ఎస్‌కెఎం ఎంఎల్‌ఎలు అందరూ ఉన్నారు. ఇంతకు ముందు వరకు ముఖ్యమంత్రిగా ఉన్న తమంగ్ ఆదివారం సాయంత్రం గవర్నర్‌ను కలుసుకుని కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు వీలు కల్పించేందుకు తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. అసెంబ్లీ ఎన్నికల్లో 32 సీట్లకు గాను 31 సీట్లను ఎస్‌కెఎం గెలుచుకున్నది. ప్రతిపక్ష ఎస్‌డిఎఫ్ ఒక సీటు గెలిచింది. ఎన్నికల వోట్ల లెక్కింపు ఆదివారం జరిగింది.
సిక్కిం గవర్నర్‌తో తమంగ్ భేటీ
- Advertisement -
- Advertisement -
- Advertisement -