Monday, March 24, 2025

భైరవిగా తమన్నా అద్భుతంగా నటించారు

- Advertisement -
- Advertisement -

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ‘ఓదెల 2’లో నెవర్ బిఫోర్ క్యారెక్టర్‌లో అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘ఓదెల రైల్వే స్టేషన్’కి సీక్వెల్ ఇది. అశోక్ తేజ దర్శకత్వంలో మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్‌పై డి.మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్నా నాగ సాధువుగా మిస్టరీ ఎనర్జీతో కూడిన పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమా టీజర్ అంచనాలని నెక్స్ లెవెల్‌కి తీసుకెళ్ళింది. ఈ సినిమా ఏప్రిల్ 17న థియేటర్స్ లో విడుదల కానుంది.

హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. థ్రిల్లింగ్ యాక్షన్‌ను కథలలో అద్భుతంగా మిళితం చేయడంలో పేరుతెచ్చుకున్న సంపత్ నంది ఓదెల 2ని పర్యవేక్షిస్తున్నారు. ప్రెస్‌మీట్‌లో హీరోయిన్ తమన్నా భాటియా మాట్లాడుతూ “ఓదెల సినిమాని డైరెక్టర్ అశోక్ చాలా అద్భుతంగా తీశారు. ఆ సినిమా చూసినప్పుడే దానికి పార్ట్ 2 ఉండాలని భావించాను. సంపత్ నంది పార్ట్- 2 ఐడియా చెప్పినప్పుడు ఆసక్తికరంగా అనిపించింది. ఇది ఈజీ జోనర్ కాదు. ఒక పల్లెటూరి కథని ఇంత ఆసక్తికరంగా థ్రిల్లింగ్ గా చెప్పడం మామూలు విషయం కాదు. డైరెక్టర్ అశోక్ సినిమాని నెక్స్ లెవెల్‌లో తీశారు”అని అన్నారు.

మూవీ క్రియేటర్ సంపత్ నంది మాట్లాడుతూ “సినిమాలో భైరవి పాత్రలో తమన్నా చాలా అద్భుతంగా నటించారు. ఈ పాత్ర తమన్నా కోసమే పుట్టింది. ఆమెను వెతుక్కుంటూనే వెళ్ళింది”అని పేర్కొన్నారు. నిర్మాత డి.మధు మాట్లాడుతూ “మహా కుంభమేళాలో రిలీజ్ చేసిన ఈ సినిమా టీజర్‌కి చాలా అద్భుతమైనటువంటి స్పందన వచ్చింది. చాలా ఆర్గానిక్‌గా ఒక విలేజ్‌లో జరిగే స్టొరీ ఇది. కంటెంట్ ని నమ్ముకుని ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమా చేయడం జరిగింది. తమన్నా ఈ సినిమాలో అద్భుతంగా నటించారు”అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ అశోక్ తేజ, పూజ, వశిష్ట సింహ, నాగమహేష్, గగన్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News