Monday, April 7, 2025

అవి నా జీవితాన్ని మార్చేశాయి.. ఇప్పుడు సంతోషంగా ఉన్నా: తమన్నా

- Advertisement -
- Advertisement -

తన సినీ కెరీర్ 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఆసక్తిక విషయాలను పంచుకున్నారు. ఓ మీడియా ఛానెల్ తో తమన్నా మాట్లాడుతూ.. సినీ ఇండస్ట్రీలో 20 ఏళ్లు పూర్తి చేసుకోవడం పట్లు సంతోషం వ్యక్తం చేశారు. తాను సినీ ఫీల్డ్ కు వచ్చినప్పుడు.. ఇనేళ్లు కొనసాగుతానని అనుకోలేదన్నారు. తాను నటనను కేవలం వృత్తిగా కాకుండా ఇష్టంగా, సంతోషంతో చేశానని తెలిపారు. ఇన్నేళ్ల సినీ కెరీర్ విషయాలను నేర్చుకున్నానన్నారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని చెప్పారు. ఆధ్యాత్మికత, ధ్యానం తన జీవితాన్ని మార్చేశాయని తమన్నా తెలిపారు. ప్రస్తుతం తాను ఎంతో సంతోషంగా ఉన్నానని.. ఇదే తాను సాధించిన విజయమన్న మిల్కీ బ్యూటీ చెప్పుకొచ్చారు.

కాగా, ప్రస్తుతం తమన్నా ‘ఓదెల 2’ సినిమా చేస్తున్నారు. దీన్ని తెలుగుతోపాటు హిందీలోనూ విడుదల చేయనున్నారు మేకర్స్. థ్రిల్లర్ ‘ఓదెల రైల్వే స్టేషన్’కి సీక్వెల్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అశోక్ తేజ దర్శకత్వంలో, మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్‌పై డి మధు నిర్మించిన ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ఈ నెల 8న ముంబైలో లాంచ్ చేయనున్నారు మేకర్స్. ఏప్రిల్ 17న థియేటర్లలో విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News