Tuesday, April 8, 2025

ఇప్పుడే నేను ఆనందంగా ఉన్నాననిపిస్తోంది:తమన్నా భాటియా

- Advertisement -
- Advertisement -

మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా తెలుగు ఆడియన్స్‌కు ఎంతగానో దగ్గరైంది. నార్త్‌కు చెందిన ఈ ముద్దుగుమ్మ సౌత్ లోనే మంచి గుర్తింపు దక్కించుకుంది. దక్షిణాది ఆడియన్స్‌తోనే కెరీర్ ను నిలబెట్టుకుంది. టాలీవుడ్, కోలీవుడ్‌లో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. తన డ్యాన్స్ స్కిల్స్, బ్యూటీఫుల్ లుక్‌తో సౌత్ ఆడియన్స్‌ను కట్టిపడేసింది. విభిన్నమైన పాత్రలు పోషించి ఆకట్టుకుంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో పలు అవార్డులను కూడా అందుకొని ప్రశంసలు పొందింది. ఇక తమన్నా తన ప్రియుడు విజయ్‌వర్మతో విడిపోయిందంటూ వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మిల్క్ బ్యూటీ ప్రేమపై మాట్లాడుతూ “నిస్వార్థమైన ప్రేమను నేను నమ్ముతాను. ప్రేమను ఎప్పుడైతే వ్యాపార లావాదేవీగా చూడటం మొదలుపెడతామో అప్పుడే అసలు సమస్యలొస్తాయి.

ఇక రిలేషన్‌లో ఉన్నప్పుడు కంటే లేనప్పుడే నేను ఆనందంగా ఉన్నాననిపిస్తోంది”అని పేర్కొంది. అయితే మరోవైపు సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మ ఫుల్ యాక్టివ్‌గా కనిపిస్తూ తన గురించిన లేటెస్ట్ అప్డేట్స్‌ను అభిమానులతో పంచుకుంటోంది. ముఖ్యంగా మిల్క్ బ్యూటీ తన బ్యూటీఫుల్ లుక్స్ తో మెరుస్తూ అభిమానులను షేక్ చేస్తోంది. స్టన్నింగ్ అవుట్ ఫిట్లలో దర్శనమిస్తూ కుర్ర హృదయాలను కొల్లగొడుతోంది. రోజురోజుకు అందాన్ని పెంచేస్తూ చూపు తిప్పుకోకుండా చేస్తోంది. ఇక తాజాగా తమన్నా పంచుకున్న కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. తాజాగా ఈ ముద్దుగుమ్మ బ్యూటీఫుల్ ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఒక్కో ఫొటోను చూస్తే తమన్నా పాలరాతి బొమ్మలాగే కనిపిస్తోంది. ఆమె అందానికి నిండు జాబిలమ్మే చిన్నబోయేలా ఉందంటే అతిశయోక్తి కాదు. తాజాగా అభిమానులతో షేర్ చేసుకున్న ఫొటోలను క్షణాల్లో లైక్స్, కామెంట్లతో నెట్టింట వైరల్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News