Monday, January 20, 2025

బీచ్‌లో ఎంజాయ్

- Advertisement -
- Advertisement -

Tamanna is enjoying in the Maldives

 

సమయం దొరికితే చాలు మాల్దీవుల్లో వెకేషన్‌కి వెళ్తున్నారు సినిమా తారలు. కొందరు సరదాగా వెళ్తుంటే మరికొందరి కొన్ని బ్రాండ్స్ ప్రొమోషన్ కోసం, అక్కడి టూరిజం రిసార్ట్‌ల ప్రచారం కోసం వెళ్లి వస్తున్నారు. తాజాగా తమన్నా మాల్దీవులకు వెళ్లి ఎంజాయ్ చేస్తోంది. అక్కడ సరదాగా గడుపుతోంది. ఆమె ఒక బ్రాండ్ ప్రొమోషన్ కోసమే అక్కడికి వెళ్లింది. పనిలో పనిగా బీచుల్లో రకరకాల భంగిమల్లో ఫోజులు ఇస్తూ, సరదాగా సైకిల్‌పై తిరుగుతూ ఎంజాయ్ చేస్తోంది. ఈ ఫోటోలని తన ఇన్ స్టాగ్రామ్ వేదికపై షేర్ చేస్తోంది. 32 ఏళ్ల ఈ సుందరి హీరోయిన్‌గా మళ్ళీ బిజీగా మారింది. దీంతో పెళ్లి ఆలోచనని వాయిదా వేసుకున్నట్లు సమాచారం. గతేడాది పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమవ్వాలని భావించింది. అయితే ఇప్పుడు మళ్ళీ వరుసగా సినిమా ఆఫర్లు ఆమెకు వస్తున్నాయి. బాలీవుడ్‌లో మధుర్ బండార్కర్ దర్శకత్వంలో ‘బబ్లీ బౌన్సర్’ సినిమా, తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన ‘భోళా శంకర్’ సెట్స్ పై ఉన్నాయి. ఇక విడుదలకి సిద్ధంగా ఉన్న చిత్రాల్లో ఎఫ్ 3, గుర్తుందా శీతాకాలం ఉన్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News