Thursday, December 26, 2024

ఛాలెంజింగ్‌గా తీసుకొని చేశా

- Advertisement -
- Advertisement -

దాదాపు రెండు దశాబ్దాలుగా స్టార్ హీరోయిన్‌గా కెరీర్ కొనసాగిస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా నటించిన తాజా చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’. చినబాబు, ఎంఎస్ రెడ్డి సమర్పణలో శ్రీ వేదాక్షర ఫిలింస్, నాగశేఖర్ మూవీస్, మణికంఠ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై యంగ్ హీరో సత్యదేవ్, తమన్నా, మేఘా ఆకాష్, కావ్య శెట్టి, ప్రియదర్శి, సుహాసిని ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు. కన్నడ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ నాగశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని చింతపల్లి రామారావు, భావన రవి, నాగశేఖర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 9న గ్రాండ్‌గా ప్రేక్షకులు ముందుకు వస్తున్న సందర్భంగా మిల్కీ బ్యూటీ తమన్నా మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…

ఛాలెంజింగ్‌గా తీసుకున్నా…
రీమేక్ సినిమాలో నటించడం అనేది నాకు కొత్త కాదు. కానీ ఒరిజినాలిటీని మిస్ కాకుండా ఛాలెంజ్‌లా తీసుకొని చేస్తాను. ఎందుకంటే అప్పటికే క్యారెక్టర్స్ చేసి ఉంటారు కాబట్టి చూసే ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా క్యారెక్టర్ చేయడాన్ని ఛాలెంజింగ్‌గా తీసుకున్నాను. ఈ సినిమాలో నేను చేసిన ఎమోషన్స్, క్యారెక్టరైజేషన్ ఆకట్టుకుంటాయి.
ఆ కోరిక తీరింది…
సత్యదేవ్‌తో నటించడం చాలా సంతోషంగా ఉంది. తను నటించిన ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య సినిమా చూసిన తర్వాత… ఆయన యాక్టింగ్ చాలా సహజంగా అనిపించి తనతో చేయాలన్న ఆసక్తి కలిగింది. ఆ తర్వాత ఈ సినిమా ఆఫర్ రావడంతో ఆ కోరిక తీరి ఇద్దరం కలిసి మంచి భావోద్వేగాలను పండించడానికి అవకాశం దొరికింది.
న్యాయం చేయాలని చూస్తా…
నేను స్టార్ హీరోయిన్ మిగతా వాళ్లు కొత్త వాళ్ళని ఎప్పుడూ అనుకోను. నా క్యారెక్టర్ వరకు నేను న్యాయం చేయాలని చూస్తాను. అయితే డైరెక్టర్ నాగశేఖర్ కూడా యాక్టర్ కావడంతో మాకు ఈ సినిమా చేయడం సులభంగా అనిపించింది.
ఆ అంచనాలను అందుకుంటాము…
గుర్తుందా శీతాకాలం సినిమాను గీతాంజలి సినిమాతో పోలుస్తున్నారు. అది నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక క్లాసిక్ సినిమాతో మా సినిమాను పోల్చినపుడు ఆ అంచనాలను మేము అందుకుంటామన్న నమ్మకంతో ఉన్నాము.
అదే అభిరుచితో ఉన్నా…
నేను ఇండస్ట్రీకి వచ్చి 17 సంవత్సరాలు అయింది. ఇప్పటివరకు నాకు సినిమాపై ఉన్న క్రేజ్ తగ్గలేదు. ఫస్ట్ వచ్చినప్పుడు సినిమాపై నాకు ఎలాంటి అభిరుచి ఉందో ఇప్పుడు అదే అభిరుచితో ఉన్నాను.
తదుపరి చిత్రాలు…
ఈ సంవత్సరం నేను చేసిన ‘ఎఫ్ 3’ విడుదల తరువాత ఇప్పుడు ‘గుర్తుందా శీతా కాలం‘ రిలీజ్ అవుతుంది. దీని తరువాత చిరంజీవితో ‘భోళాశంకర్’ ప్రాజెక్ట్ చేస్తున్నాను. అలాగే ఓటిటిలో మూడు ప్రాజెక్ట్ చేస్తున్నాను. మలయాళంలో మొదటి సారిగా బాంద్రా సినిమా చేస్తున్నాను.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News