పెళ్లి చేసుకుంటాడు అనుకున్న ప్రియుడు ఆ విషయంలో నాన్చుతుండడంతో అతనికి బ్రేకప్ చె ప్పింది తమన్నా. అంతేకాదు, చాలా తొందరగా ఆ బ్రే కప్ బాధ నుంచి బయటపడింది. మళ్ళీ కెరీర్‌పై దృష్టి పెట్టింది ఈ మిల్క్ బ్యూటీ. రెండేళ్ల పాటు డేటింగ్ చేసి న విజయ్ వర్మతో ఆమె ఇటీవలే తెగతెంపులు చేసు కుందన్న విషయం తెలిసిందే. ఇక బ్రేకప్ తర్వాత ఆమె ఒక పెద్ద సినిమా ఒప్పుకొంది. అది కూడా బాలీవుడ్‌లో నే. తమన్నా ఒప్పుకున్న కొత్త చిత్రం.. మిషన్ మంగళ్. అజయ్ దేవగన్ సరసన నటించనుంది ఇందులో.
ఈ నెలాఖరులో షూటింగ్ మొదలు కానుంది. తమన్నా ఇంతకుముందు అజయ్ దేవగన్ సరసన హిమ్మత్ వాలా రీమేక్ లో కూడా నటించింది. మరిన్ని సినిమాలు కూడా చేస్తానంటోంది. ఆమెకి ఇటీవల హీరోయిన్ గా కన్నా బాలీవుడ్ లో స్పెషల్ సాంగ్ లకు క్రేజ్ పెరిగింది. స్త్రీ 2 సినిమాలో ఆమె చేసిన ప్రత్యేక గీతం ఏకంగా 500 మిలియన్ వ్యూస్ పొందింది. ఒక్క యూట్యూబ్ లోనే ఈ వ్యూస్ అందుకొంది. దాంతో బాలీవుడ్ లో ఈ భామకి ఇలాంటి పాటలు, పాత్రలు ఇంకా వస్తూనే ఉన్నాయి.