Sunday, December 22, 2024

నాగ సాధు అవతార్‌లో భయపెడుతూ…

- Advertisement -
- Advertisement -

తమన్నా భాటియా హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ’ఓదెల 2’, ఇది 2021లో హిట్ అయిన ఓదెల రైల్వే స్టేషన్‌కి సీక్వెల్. అశోక్ తేజ దర్శకత్వంలో మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్ నిర్మించిన ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. నాగ సాధు పాత్రలో తమన్నా స్టన్నింగ్ పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. అయితే తమన్నా భాటియాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ,

ఓదెల 2 నిర్మాతలు ఆమెను పెరోషియస్ నాగ సాధు అవతార్‌లో చూపిస్తూ సరికొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. పోస్టర్‌లో ఆమె పుర్రెలపై ధైర్యంగా నడుస్తున్నట్లు కనిపించారు, రాబందులు పైన ఎగురడం ఆసక్తికరంగా వుంది. ఈ అద్భుతమైన పోస్టర్ చిత్రంలో ఆమె పాత్ర పవర్‌ఫుల్ స్వభావాన్ని సూచిస్తోంది. ఓదెల 2 చిత్రాన్ని భారీ బడ్జెట్, హై క్యాలిటీ ప్రొడక్షన్ వాల్యూస్‌తో రూపొందిస్తున్నారు. ఎంగేజింగ్ కథనాలతో థ్రిల్లింగ్ యాక్షన్‌ను చూపించడంలో పాపులరైన సంపత్ నంది ఈ చిత్రాన్ని సూపర్ విజన్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News