తమన్నా భాటియా హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘ఓదెల 2’లో నెవర్ బిఫోర్ క్యారెక్టర్ లో అలరించడానికి సిద్ధంగా వున్నారు. సూపర్ నేచురల్ థ్రిల్లర్ ’ఓదెల రైల్వే స్టేషన్’కి సీక్వెల్ ఇది. సంపత్ నంది సూపర్ విజన్‌లో అశోక్ తేజ దర్శకత్వంలో, మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్‌పై డి మధు ఈ చిత్రాన్ని నిర్మించారు. తమన్నా నాగ సాధువుగా, మిస్టరీ ఎనర్జీతో కూడిన పాత్రలో కనిపించనున్నారు. హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 17న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ క్రియేటర్ సంపత్ నంది విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “డైరెక్టర్ అశోక్ ఈ సినిమాకి సీక్వెల్ ఎందుకు రాయకూడదు అని అడిగారు.
ఒకసారి భీమ్స్‌తో మ్యూజిక్ సిట్టింగ్స్ కి వెళ్లాను. అప్పుడు ఆ మ్యూజిక్ సిటింగ్స్ అవ్వలేదు కానీ ఈ సీక్వెల్ ఆలోచన అక్కడే వచ్చింది.-ఫస్ట్ పార్ట్‌లో హెబ్బా పటేల్ చేసిన రాధ క్యారెక్టర్ హైలెట్ అయింది. సెకండ్ పార్ట్ లో కూడా ఒక ఫిమేల్ క్యారెక్టర్ బలంగా ఉంటే బాగుంటుందని అనుకున్నాం. ఫస్ట్ పార్ట్‌లో ఒక దుష్ట శక్తి అంతం అవుతుంది. దాని ఆత్మని అదుపు చేయడానికి మరో శక్తి కావాలి. శివశక్తి లాంటి క్యారెక్టర్ వస్తే ఎలా ఉంటుందని ఆలోచన పుట్టింది. తమన్నాతో ఇంతకుముందే రెండు సినిమాలు చేశాను. తను చాలా మంచి నటి. తనకి కూడా కథ చాలా నచ్చింది. ఇక శివశక్తులు నాగసాధువులుగా మారతారని శివాలయాలను పునరుద్ధరణ చేస్తారని ఇలా చాలా సమాచారం తెలిసింది.
అలా నాగసాధు క్యారెక్టర్ పుట్టింది. ఈ సినిమా కోసం తమన్నా ఎండలో చెప్పులు లేకుండా నటించారు. పూర్తిగా శాకాహారిగా మారిపోయారు. డైరెక్టర్ -అశోక్‌ను డైరెక్టర్ చేయాలనే ఓదెల సినిమా తీయడం జరిగింది. ఇప్పుడు ఈ సినిమాను కూడా చాలా అద్భుతంగా తీశాడు. ప్రొడ్యూసర్ మధు ఏదైనా ఆలోచన చెప్పినప్పుడు నచ్చితే వెంటనే చేస్తాం అని అంటారు. ఈ సినిమాని కాశీలో లాంచ్ చేద్దామని చెప్పాను. మరో ఆలోచన లేకుండా ఖర్చు గురించి ఆలోచించకుండా లాంచ్ చేశారు. అలాగే కుంభమేళాలో టీజర్ లాంచ్ చేయడం ఆయన ఫ్యాషన్‌తోనే సాధ్యపడింది. ఒక సంకల్ప బలంతో ఈ సినిమా చేయడం జరిగింది”అని అన్నారు.