Sunday, December 22, 2024

ఐపిఎల్ స్ట్రీమింగ్ కేసు… నటి తమన్నాకు సమన్లు

- Advertisement -
- Advertisement -

ప్రముఖ నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీస్ విభాగం సమన్లు జారీ చేసింది. ఐపీఎల్ 2023 మ్యాచ్‌లను అక్రమంగా “ఫెయిర్ ప్లే” యాప్‌లో ప్రదర్శించిన కేసులోఆమెను ప్రశ్నించేందుకు ఈ నోటీసులిచ్చింది. ఈ నెల 29న సైబర్ విభాగం ఎదుట విచారణకు హాజరు కావాలని సూచించింది. నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ మ్యాచ్‌లను ఈ యాప్‌లో ప్రసారం చేయడంతో ‘వయాకామ్’ మీడియాకు రూ. కోట్ల మేర నష్టం జరిగిందని సైబర్ విభాగం వెల్లడించింది. ఇదే కేసులో ఇటీవల మరో నటుడు సంజయ్ దత్‌కు కూడా సమన్లు జారీ అయ్యాయి. ఏప్రిల్ 23నే విచారణకు రావాలని ఆదేశించగా, ఆయన గైర్హాజరయ్యారు. ఆ సమయంలో తాను దేశంలో లేనని, వాంగ్మూలం ఇచ్చేందుకు మరో తేదీ కేటాయించాలని కోరారు. ఈ ఫెయిర్‌ప్లే యాప్ అనేది మహదేవ్ ఆన్‌లైన్ గేమింగ్ అండ్ బెట్టింగ్ అప్లికేషన్‌కు అనుబంధ సంస్థ.

ఇందులో ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రసారం చేసేందుకు ఎలాంటి అధికారిక బ్రాడ్ కాస్టింగ్ హక్కులు లేవు. అయినప్పటికీ గత ఏడాది నిబంధనలకు విరుద్ధంగా కొన్ని మ్యాచ్‌లను ఈ యాప్‌లో ప్రసారం చేశారు. వాటిని చూడాలంటూ పలువురు బాలీవుడ్ నటులు, గాయకులు ప్రచారం చేశారు. ఫలితంగా వయాకామ్‌కు రూ. కోట్లల్లో నష్టం రావడంతో ఆ సంస్థ పోలీస్‌లను ఆశ్రయించింది.న ఈ కేసులో గతంలో బాలీవుడ్ గాయకుడు బాద్‌షా , నటి జాక్వెలిన్ ఫెర్నాండెస్ , సంజయ్ దత్ మేనేజర్లను సైబర్ విభాగం ప్రశ్నించింది. ఇక, మహదేవ్ బెట్టింగ్ యాప్ గత ఏడాది వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఆన్‌లైన్ బెట్టింగ్ ముసుగులో మనీలాండరింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు ఈడీ గుర్తించి దానిపై కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారం అప్పట్లో బాలీవుడ్‌ను కుదిపేసింది. పలువురు నటీనటులకు సమన్లు జారీ అయ్యాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News