Wednesday, January 22, 2025

ఆ ఆలోచన లేదంటున్న మిల్కీ బ్యూటీ..

- Advertisement -
- Advertisement -

తమన్నా సూపర్ అందెగత్తె. ఆమెకి మిల్కీ బ్యూటీ అన్న పేరు ఉంది. అయితే ఆమె ఇప్పుడు సీనియర్ అయిపోయింది. ఇప్పటికే 18 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకుంది. అయితే ఈ బ్యూటీ ఈ మధ్య బరువు పెరిగింది. నిత్యం జిమ్‌కి వెళ్తుంది ఈ భామ. అలాగే ఫిట్‌నెస్ కోసం కసరత్తులు చేస్తుంది. అయినా అప్పుడప్పుడు ఆమె బొద్దుగా కనిపిస్తోంది.మూడు, నాలుగు రోజులు జిమ్‌కి డుమ్మా కొడితే వెంటనే బరువు పెరుగుతున్నాను అంటోంది ఈ భామ. ఇదే ఆమెకున్న సమస్య. ఇటీవల విడుదలైన జైలర్ సినిమాలో ఈ భామ అలా బొద్దుగానే కనిపించింది.

అలాగే తాజాగా ఒక ఫ్యాషన్ ఈవెంట్ లో ఆమె ర్యాంప్‌పై నడిచింది. అప్పుడూ అలాగే కనిపించింది. ఒక్క రోజు కూడా జిమ్ ఎగ్గొట్టకుండా కష్టపడితేనే ఆమె ఫిట్‌గా ఉంటుంది అన్నమాట. ఇప్పటికే 75 చిత్రాలు పూర్తి చేసింది. అనేక వెబ్ సిరీస్‌లో కూడా నటించింది. హీరోయిన్‌గా ఎంతో సాధించింది, ఎంతో సంపాదించింది. అయినా పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వాలనే ఆలోచన ఇప్పట్లో లేదు అంటోంది. కెరీర్ ముఖ్యమని అంటోంది ఈ మిల్కీ బ్యూటీ.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News