- Advertisement -
ప్రముఖ నటి తమన్నా కాశీలో హల్ చల్ చేస్తున్నారు. ఒక సినిమా షూటింగ్ లో భాగంగా వారణాసికి వెళ్లిన తమన్నా, పనిలో పనిగా కాశీ విశ్వనాథుడిని దర్శించుకుని, భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. ఆలయ ప్రాంగణమంతా కలియదిరుగుతూ సరదాగా గడిపారు. ఆ తర్వాత గంగానదిలో స్నానమాచరించి, కాసేపు ఒడ్డున సేదతీరారు. ఈ ఫోటోలు నెట్లో వైరల్ అవుతున్నాయి.
తమన్నా ఓదెల 2 మూవీ షూటింగ్ లో భాగంగా వారణాసికి వెళ్లారు. రెండేళ్ల క్రితం ఓదెల రైల్వే స్టేషన్ మూవీ ఓటిటిలో విడుదలై హిట్ అయిన సంగతి తెలిసిందే. దీనికి సీక్వెల్ గా ఓదెల 2 మూవీ షూటింగ్ శుక్రవారం వారణాసిలో ప్రారంభమైంది. ఈ మూవీకి సంపత్ నంది క్రియేటర్ కాకా అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నారు. మరో హీరోయిన్ హెబ్బా పటేల్ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. కాంతారా ఫేమ్ అజనీష్ లోక్ నాథ్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.
- Advertisement -