Wednesday, January 22, 2025

ఆరంభ వేడుకల్లో సందడి చేయనున్న తమన్నా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : శుక్రవారం జరిగే ఐపిఎల్ ఆరంభ వేడుకలకు స్టార్ నటి తమన్నా భాటియా ప్రత్యేక ఆకర్షణగా మారారు. నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో తమన్నా అలరించనున్నారు. తమన్నాతో పాటు మరికొంత మంది స్టార్లు కూడా ఆరంభ వేడుకల్లో సందడి చేయనున్నారు. సాయంత్ర ఆరు గంటల నుంచి ఆరంభ వేడుకలు జరుగుతాయి. ఈ కార్యక్రమంలో తమన్నా ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనుంది. ఈ విషయాన్ని ఐపిఎల్ నిర్వాహకులు ట్విటర్ వేదికగా వెల్లడించారు. ప్రతిసారి లాగే ఈసారి కూడా ఐపిఎల్ ఆరంభోత్సవ వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు, ఫైర్‌వర్క్ అభిమానులను కనువిందు చేయనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News