Thursday, January 23, 2025

అందాలు అదనపు ఆకర్షణ

- Advertisement -
- Advertisement -

Tamannah act as item song

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న సినిమా గని. అల్లు బాబీ కంపెనీ, రెనస్సాన్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు అద్భుతమైన స్పందన వస్త్తోంది. ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ తమన్నా ఐటం సాంగ్ చేసా రు. ఈ మధ్యే విడుదలైన పాటకు అనూహ్యమైన స్పందన వస్తోంది. యూ ట్యూబ్‌లో మిలియన్స్ కొద్దీ వ్యూస్ వస్తున్నాయి. ‘కొడితే’ అంటూ సాగే ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా హారిక నారాయణ్ పాడారు. తమ న్నా అందచందాలు పాటకు అదనపు ఆకర్షణ. ఈ సిని మా కోసం వరుణ్ తేజ్ చాలా మేకోవర్ అయ్యారు. సిక్స్‌ప్యాక్ చేసి సరికొత్త ఫిజిక్‌తో కనిపిస్తున్నాడు. బుధవారం వరుణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News