Sunday, February 23, 2025

’ఓదెల 2’ జీవితంలో ఒకేసారి వచ్చే గొప్ప అదృష్టం:తమన్నా భాటియా

- Advertisement -
- Advertisement -

తమన్నా భాటియా హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ’ఓదెల 2’లో బోల్డ్ న్యూ క్యారెక్టర్ పోషిస్తున్నారు. సూపర్ నేచురల్ థ్రిల్లర్ ’ఓదెల రైల్వే స్టేషన్’కి సీక్వెల్ ఇది. అశోక్ తేజ దర్శకత్వంలో మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్‌పై డి.మధు నిర్మించిన ఈ చిత్రం ప్రతి అప్‌డేట్‌తో ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. తమన్నా నాగ సాధువుగా, మిస్టరీ ఎనర్జీతో కూడిన పాత్రను పోషిస్తోంది. ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభమేళాలో చిత్ర యూనిట్ బోట్ లో ప్రయాణించి త్రివేణి సంగమం వద్ద నాగసాధువుల సమక్షంలో టీజర్‌ను గ్రాండ్ గా లాంచ్ చేశారు.

చీకటి, కాంతి యొక్క పురాతన శక్తులు ఢీకొనే ప్రపంచం నేపథ్యంలో సెట్ చేయబడిన ఈ టీజర్ సూపర్ నేచురల్ రోలర్ కోస్టర్ రైడ్ గా అద్భుతమైన కథనాన్ని చూపించింది. నాగ సాధువు పాత్రను తమన్నా పోషించిన తీరు అద్భుతంగా ఉంది. టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరోయిన్ తమన్నా భాటియా మాట్లాడుతూ “మహాకుంభమేళా జీవితంలో ఒక్కసారే వస్తుంది. ఓదెల 2 సినిమా కూడా జీవితంలో ఒకేసారి వచ్చే అవకాశం. ఈ సినిమా నాకు చాలా స్పెషల్‌”అని అన్నారు. ఈ కార్యక్రమంలో సంపత్ నంది, అశోక్ తేజ, డి.మధు, వశిష్ట, అజనీష్ లోక్‌నాథ్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News