Sunday, December 22, 2024

ఎమర్జెన్సీ వార్డులో అలీఖాన్… విషం ప్రయోగమేనా?

- Advertisement -
- Advertisement -

చెన్నై: కోలీవుడ్ నటుడు మన్సూర్ అలీఖాన్‌పై విషం ప్రయోగం జరిగిందనే న్యూస్ తమిళనాడులో జరుగుతున్న పార్లమెంటు ఎన్నికలలో సంచలనం సృష్టిస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. నటుడు మన్సూర్ అలీఖాన్ కూడా పార్లమెంటు ఎన్నికలలో పోటీ చేస్తుండడంతో తీరిక లేకుండా ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు. వేలూరు ప్రచారం చేస్తుండగా కొందరు ఆయన చేత బలవంతంగా పండ జ్యూస్ తాగించారు. మళ్లీ కొంచెం దూరం వెళ్లిన తరువాత మజ్జిగ తాగించడంతో కడుపులో నొప్పిగా ఉందని ఆలీఖాన్ కిందపడిపోయాడు. వెంటనే అతడిన కార్యకర్తలు సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స చేసిన మెరుగైన వైద్యం కోసం మరో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డులో చికిత్స తీసుకుంటున్నారు. ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆలీఖాన్ పై విషం ప్రయోగం జరిగిందని ఆరోపణలు చేశారు. రాజకీయమే కోసం విషం ప్రయోగం చేశారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News