Monday, December 23, 2024

సినీ ప‌రిశ్ర‌మ‌లో మ‌రో విషాదం.. ప్రముఖ క‌మెడియ‌న్ క‌న్నుమూత‌

- Advertisement -
- Advertisement -

ప్రముఖ కోలీవుడ్‌ హస్యనటుడు మయిల్‌స్వామి కన్నుమూశారు. ఆదివారం తెల్లవారుజామున మయిల్‌ స్వామి ఒంట్లో నలతగా ఉండటంతో కుటుంబసభ్యులు పోరూర్‌లోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. మయిల్‌ స్వామి మరణ వార్త విన్న తమిళ ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది. ఆయన మృతిపట్ల పలువురు కోలీవుడ్‌ సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

మయిల్‌ స్వామి 1984లో ధవని కనవుగల్‌ చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాతోనే తనదైన కామెడీతో అందరికీ ఆకట్టుకున్నాడు. ఇక అప్పటినుండి మయిల్‌స్వామి వెనుదిరిగి చూసుకోలేదు. ఎన్నో చిత్రాల్లో కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. నాలుగు దశాబ్దాల కెరీర్‌లో సుమారు 200 చిత్రాలకుపైగా నటించాడు. గతేడాది వచ్చిన ది లెజెండ్‌ సినిమాలోనూ మయిల్‌స్వామి మంచి పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఆయన మృతిపట్ల కమల్ హాసన్ ట్విట్టర్‌ ద్వారా నివాళులర్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News