Thursday, December 19, 2024

పార్టీ జెండాను ఆవిష్కరించిన తమిళ నటుడు విజయ్

- Advertisement -
- Advertisement -

చెన్నై: తమిళ నటుడు విజయ్ గురువారం తన సొంత పార్టీ తమిళగ వెట్రి కళగం(టివికె) జెండాను ఆవిష్కరించారు. ఇక్కడకు సమీపంలోని పనయూర్‌లో తన పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన జెండాను ఎగురవేశారు.పైన ఎరుపు, కింద పసుపు రంగులు, మధ్యలో రెండు ఢీకొంటున్న ఏనుగులతోపాటు దోరిసెన పువ్వు(వాగై పువ్వు) తో కూడిన జెండాను విజయ్ పార్టీ కార్యకర్తల సమక్షంలో ఆవిష్కరించారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్షంగా బరిలోకి దిగుతున్న టివికె పార్టీకి చెందిన గీతాన్ని కూడా విజయ్ ఆవిష్కరించడంతో తమిళనాడు రాజకీయాలలో నూతన అధ్యాయం మొదలైనట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలోనే విజయ్ తన పార్టీని ప్రారంభించినప్పటికీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో తాను కాని, తన పారీ తరఫున కాని అభ్యర్థులెవరినీ నిలబెట్టలేదు. అంతేగాక ఆయన ఏ పార్టీకి మద్దతు ప్రకటించలేదు. టివికె పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం విజయ్ పార్టీ కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేయించారు. కుల, మత, లింగ, జన్మస్థలం పేరిట మనుషులలో ఏర్పడిన అంతరాలను తొలగిస్తామని, అందరికీ సమాన అవకాశాలు, హక్కుల కోసం పోరాడడంతోపాటు ప్రజలలో చైతన్యం తీసుకువస్తామని పార్టీ సంకల్పాన్ని పూరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News