Thursday, January 23, 2025

కేరళకు అండగా తమిళ నటులు

- Advertisement -
- Advertisement -

చెన్నై: కేరళలో భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడిన కారణంగా నష్టపోయిన వారికి కోలివుడ్ హీరోలు అండగా నిలిచారు. ఇప్పటి వరకు 200 మందికి పైగా మరణించగా, 250 మందికి పైగా గాయపడ్డారు. ఇంకా ఆచూకీ దొరక్కుండా పోయిన వారి సంగతి సరేసరి. ముఖ్యంగా వాయనాడ్, తిరువనంతపురం ప్రజలు తీవ్ర నష్టానికి గురయ్యారు. ఎక్కడ చూసినా విషాధం చోటుచేసుకుని ఉంది. ఈ నేపథ్యంలో కోలీవుడ్(తమిళ సినిమా రంగం) హీరోలు విక్రమ్, సూర్య తమ వంతు సాయం అందించడానికి ముందుకొచ్చారు. ఇప్పటికే ఇతర తమిళ నటులు తమ వంతు సాయాన్ని ప్రకటించారు.

నటుడు విక్రమ్ కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 20 లక్షలు అందించగా, సూర్య, జ్యోతి దంపతులు రూ. 50 లక్షలు కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు. బాధితులు త్వరగా కోలుకోవాలని నటుడు విజయ్ ఆశించారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News