Monday, December 23, 2024

ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న తమిళ వర్ధమాన నటి

- Advertisement -
- Advertisement -

Actress Deepa

 

చెన్నై: విరుంబాక్కంలోని ఓ ప్రయివేట్ ఫ్లాట్‌లో నివాసముంటున్న నటి దీప అలియాస్ పౌలిన్(29) శనివారం ఆత్మహత్య చేసుకుంది. గత కొన్నాళ్లుగా ఆమె ఒంటరిగా ఉంటోంది. ఆమె మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్య చేసుకునుంటుందని ఆమె స్నేహితులు చెబుతున్నారు. దీప కుటుంబ సభ్యులు ఆమెకు ఫోన్ చేయగా ఆమె లిఫ్ట్ చేయలేదు. దాంతో ఆమె స్నేహితుడు ఒకరు ఆమె ఫ్లాట్‌కు వెళ్లి చూడగా ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించింది. పోలీసులు ఘటనాస్థలికి చేరకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానిస్తున్నారు. ఆమె ఆత్మహత్య చేసుకున్న ప్రదేశంలో సూసైడ్ నోట్ లభించినట్లు తెలుస్తోంది. ఆమె అందులో ఒకరిని జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటానని పేర్కొంది. కానీ అతడి పేరును మాత్రం వ్యక్తం చేయలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News