Monday, December 23, 2024

తమిళ్ సినిమాకు మళ్లీ స్వర్ణ యుగం రాబోతోంది: కమల్ హాసన్

- Advertisement -
- Advertisement -

చెన్నై: ప్రముఖ దర్శకుడు మణిరత్నం తీసిన తాజా చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్2’పై ప్రముఖ నటుడు కమల్ హాసన్ సోమవారం తన అభిప్రాయాలు వెల్లడించారు. ఆ సినిమాను, అందులో నటించిన వారిని ప్రశంసించారు. ఏఎన్‌ఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన మాట్లాడుతూ తనకు, మణిరత్నంతో ఉన్న స్నేహం గురించి మాట్లాడటమే కాకుండా, సినిమాను ప్రశంసించారు. వేడుక చేసుకోవాల్సిన సినిమా ఇదన్నారు.

ఆయన మాట్లాడుతూ ‘నేను ఓ ఆర్టిస్ట్‌ను, నిర్మాతను, దర్శకుడిని. ఇక రెండోది, నేను సినిమా అభిమానిని. పైగా తమిళుడను. తమిళుల ప్రతిభకు, టెక్నికల్ నైపుణ్యానికి నేను గర్విస్తున్నాను. దీనిని ప్రతి ఒక్కరూ, ప్రపంచం కూడా చూస్తున్నది. నేను ఈ సినిమాలో నటించిన నటుల గురించి, కథ గురించే మాట్లాడ్డంలేదు, నా దృష్టిలో క్రెడిటంతా మణిరత్నంకు పోవాల్సిందే’ అన్నారు. సినిమా తీయడంలో మణిరత్నం ప్రతిదీ మనస్సు పెట్టి చేస్తారు. తమిళ్ సినిమా అంతర్జాతీయ ఖ్యాతినార్జించడానికి వారు ఎంతో కృషి చేశారన్నారు.

పొన్నియిన్ సెల్వన్2 సినిమాకు ఎఆర్ రహ్మాన్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమా కల్కి కృష్ణమూర్తి రాసిన ఐదు భాగాల నవల ఆధారంగా తీసింది. పొన్నియిన్ సెల్వన్1 సినిమా… నవలలో మూడింట ఒక వంతు భాగాన్నే కవర్ చేసింది. మిగతాది రెండో సినిమాలో చూయించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News