Tuesday, January 21, 2025

వరద బాధితులకు తమిళ హీరో విరాళం

- Advertisement -
- Advertisement -

ఆపదలో వున్న వారికి ఆపన్నహస్తం అందించడానికి బా షా పరిమితు లు, ప్రాంతీ య భేదాలు ఉండవు. ఇప్పు డు అలాంటి కోవలోకి వస్తాడు తమిళ కథానాయకుడు శింబు. గతంలో కూడా పలుసార్లు తన మంచితనాన్ని సహృదయతను చాటుకున్న ఈ తమిళ కథానాయకుడు మరోసారి తన ఉదారతను చాటాడు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల కోసం హీరో శింబు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి తన వంతు సహాయంగా ఆరు లక్షల విరాళం ప్రకటించారు. వరదల వల్ల తీవ్రంగా నష్టం పోవడం తనకు ఎంతో బాధను కలిగిస్తోందని, అందరూ త్వరితగతిన ఈ విపత్తు నుండి బయటపడాలని ఆ దేవుడిని కోరుకుంటున్నానని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News