పరువునష్టం కేసులో సెప్టెంబర్ 13న తమ ఎదుట హాజరుకావాలని తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ ఎం అప్పావును ఎంపి/ఎమ్మెల్యే కోర్టు సోమవారం ఆదేశించింది. ఎఐడిఎంకె న్యాయవాదుల విభాగం సంయుక్త కార్యదర్శి బిఎం బాబు మురుగవేల్ దాఖలు చేసిన పరువునష్టం కేసు విచారణను ప్రత్యేక న్యాయయూర్తి జి జయవేల్ వచ్చే శుక్రవారానికి వాయిదా వేశారు. మురుగవేల్ తెలిపిన వివరాల ప్రకారం ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో స్పీకర్ అప్పావు ప్రసంగిస్తూ 2016లో అప్పటి ముఖ్యమంత్రి,
ఎఐఎడిఎంకె అధినేత్రి జె జయలలిత మరణానంతరం డిఎంకెలో చేరేందుకు 40 మందికి పైగా ఎఐఎడిఎంకె ఎమ్మెల్యేలు సిద్ధపడ్డారని, కాని వారిని చేర్చుకునేందుకు డిఎంకె అధినేత ఎంకె స్టాలిన్ నిరాకరించారని తెలిపారని చెప్పారు. అప్పావు వ్యాఖ్యలు ఎఐడిఎంకె ఎమ్మెల్యేల ప్రతిష్టను దెబ్బతీశాయని, అందుకే స్పీకర్‌పై పవురునష్టం కేసు దాఖలు చేశామని మురుగవేల్ తెలిపారు.