Sunday, December 22, 2024

పీచు మిఠాయి అమ్మకంపై నిషేధం.. తమిళనాడు ప్రభుత్వ ఆదేశం

- Advertisement -
- Advertisement -

చెన్నై: తమిళనాడులో పీచు మిఠాయి అమ్మకాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. చెన్నైలో పీచు మిఠాయి అమ్మే దుకాణాల నుంచి సేకరించిన శాంపిల్స్‌ను అధ్యయనం చేయగా అందులో క్యాన్సర్ కారక పదార్థాలు ఉన్నట్లు వెల్లడైందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి మా సుబ్రమణియన్ శనివారం తెలిపారు. కృత్రిమ రంగు వచ్చేందుకు పీచు మిఠాయి తయారీలో రోడమిన్- బి అనే ఇండ్రిస్ట్రియల్ డైను ఉపయోగిస్తున్నట్లు శాంపిల్స్ అధ్యయనంలో బయటపడిందని ఆయన చెప్పారు.

పీచు మిఠాయిలో కృత్రిమ రంగు కోసం రోడమిన్- బిని ఉపయోగిస్తున్నట్లు ప్రభుత్వ ఫుడ్ అనాలిసిస్ లేబరేటరీలో వెల్లడైందని ఆయన చెప్పారు. ఆహార భద్రత, ప్రమాణాల చట్ట ప్రకారం ఇది నాసిరకం, అపాయకర ఆహారంగా నిర్ధారించినట్లు మంత్రి తెలిపారు. చర్మ సంబంధ వస్తువుల తయారీ, పేపర్ ప్రింటింగ్‌లో వాడే రోడమిన్- బి వల్ల క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని మంత్రి చెప్పారు. తక్షణమే పీచు మిఠాయి అమ్మకాలను నిలిపివేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News