చెన్నై: ఓ బిచ్చగాడు గత ఐదు సంవత్సరాల నుంచి సిఎం సహాయనిధికి 50 లక్షల రూపాయలు దానం చేశాడు. ఈ సంఘటన తమిళనాడులో జరిగింది. మే 2020లో పూలపాండ్యన్ (72) అనే బిచ్చగాడు తమిళనాడు రాష్ట్రం తూతుకుడి జిల్లా కలెక్టర్‌కు పది వేల రూపాయలు దానం చేశాడు. వివిధ జిల్లాలలో కలెక్టర్లకు పది వేల రూపాయలు ఎనిమిది సార్లు దానం చేశాడు. ప్రస్తుతం అతడికి కుటుంబం లేదు, బిచ్చంగా తీసుకున్న డబ్బులు దానం చేసేవాడు. గత ఐదు సంవత్సరాల నుంచి అతడు ఇప్పటి వరకు రూ.50 లక్షల రూపాయలు దానం చేశాడు.
అతడికి ఒకప్పుడు పెద్ద కుటుంబం ఉండేది. 1980లో తన ఇద్దరు కుమారులు భార్యతో కలిసి తమిళనాడు నుంచి ముంబయికి వలస పోయాడు. అప్పుడు చాలా పేదరికంలో ఉండడంతో కుటుంబాన్ని పోషించడం కష్టంగా ఉండేది. అతడి భార్య సరస్వతి 24 సంవత్సరాలు క్రితం చనిపోయింది. పాండ్యాన్ ఇద్దరు కుమారులకు పెళ్లిలు చేసిన తరువాత వారు అతడిని పట్టించుకోలేదు. పాండ్యన్ కుమారులు అతడిని పట్టించుకోకపోవడంతో వాళ్ల నుంచి దూరంగా ఉన్నాడు. బిచ్చమెత్తుకొని జీవనం సాగిస్తున్నాడు., కరోనా సమయంతో కోవిడ్ రిలీఫ్ ఫండ్, శ్రీలంకలో ఉన్న తమిళులకు, వివిధ పాఠశాలలకు, పేద విద్యార్థలకు తన నగదు రూపంలో రూ.50 లక్షలు సహాయం చేశాడు. 2020లో మధురై కలెక్టర్ ఆయన దాణ గుణాలు నచ్చి పాండ్యన్ ను అవార్డుతో సత్కరించారు.