Thursday, January 9, 2025

తమిళనాడు బిజెపి అధ్యక్షుడికి ఊరట

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: బాణ సంచా నిషేధంలో క్రైస్తవ మిషనరీల పాత్రపై విద్వేషపూరిత ప్రసంగం చేశారన్న ఆరోపణలకు సంబంధించి తమిళనాడు బిజెపి అధ్యక్షుడు, మాజీ ఐపిఎస్ అధికారి అన్నామలైపై చట్టపరమైన చర్యలను చేపట్టకుండా సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది. పిటిషనర్ అన్నామలై తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా, న్యాయవాది సాయి దీపక్ వాదనలు వినిపించిన తర్వాత ఫిర్యాదుదారుడికి, రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయమూర్తి సంజయ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం నోటీసులు జారీచేసింది.

పిటిషనర్ ఇంటర్వూకు చెందిన ప్రతిని న్యాయవాదులు కోర్టుకు సమర్పించారు. ఇందులో ఎటువంటి విద్వేషపూరితమైన వ్యాయలు వేవని వారు వాదించారు. అన్నామలై వ్యాఖ్యలలో ప్రాథమికంగా చూస్తే ఐపిసిలోని సెక్షన్ 153ఎ కింద ఎటువంటి నేరంగా పరిగణించలేమని పేర్కొన్న ధర్మాసనం ఫిర్యాదుదారు పియూష్ మానుష్, తమిళనాడు ప్రభుత్వం నుంచి సమాధానం కోరుతూ నోటీసులు జారీచేసింది.

ఏప్రిల్ 29లోగా నోటీసులకు జవాబివ్వాలని కోరిన ధర్మాసనం అప్పటివరకు దీనిపై దిగువ కోర్టు ఎటువంటి చర్యలు చేపట్టరాదని ఆదేశించింది. తనపై దాఖలైన క్రిమినల్ కేసును కొట్టివేయడానికి మద్రాసు హైకోర్టు నిరాకరిచంతో దీన్ని సవాలు చేస్తూ ఫిబ్రవరి 8న అన్నామలై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీపావళి పంరుగ సందర్భంగా బాణసంచాపై నిషేధం విధించాలని కోరుతూ ఒక క్రైస్తవ మిషనరీకి చెందిన ఎన్‌జిఓ సుప్రీంకోర్టులో తొలుత కేసు వేసిందంటూ ఆ ఇంటర్వూలో అన్నామలై ఆరోపించినట్లు ఆయనపై కేసు నమోదైంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News