Wednesday, January 22, 2025

పది మందిని కాటేసిన కల్తీ మద్యం

- Advertisement -
- Advertisement -

 

చెన్నై: కల్తీ మద్యం తాగి పది మృతి చెందిన సంఘటన తమిళనాడు రాష్ట్రం చెంగల్‌పట్టు, విళ్లుపురం జిల్లాల్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… విల్లుపురం జిల్లా మరక్కణమ్ ప్రాంతం ఇక్కయార్కప్పమ్‌లో ఆదివారం కల్తీ మద్యం తాగి ఆరుగురు చనిపోయారు. చెంగల్పట్టు జిల్లా మదురంతగామ్ ప్రాంతంలో కల్తీ మద్యం తాగి నలుగురు చనిపోయారు. కల్తీ మద్యం సేవించడంతో వాంతులు, విరేచనాలతో 32 మంది వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మృతులు పి సురేష్(46), ఎస్ శంకర్ (52), జి ధర్నివెల్(50), డి రాజా మూర్తి(60), మన్నగట్టి(50), మలార్ విఝి(70)గా గుర్తించారు. కల్తీ మద్యం అమ్మిన వ్యక్తులు అమ్మవాసాయి, అమ్రాన్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Also Read: మాజీ సిఎం చంద్రబాబుకు షాక్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News