Wednesday, January 22, 2025

పంతులమ్మతో వన్ సైడ్ లవ్… 77 సార్లు ఆన్‌లైన్ డెలివరీ ఆర్డర్లతో వేధింపులు

- Advertisement -
- Advertisement -

చెన్నై: ట్యూషన్ చెబుతున్న టీచర్‌తో ఓ మైనర్ బాలుడు ప్రేమలో పడ్డాడు. టీచర్ తిరస్కరించడంతో ఆమెపై పగ పెంచుకొని వేధించిన సంఘటన తమిళనాడులోని చెన్నైలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ట్యూషన్ టీచర్(22) గత కొంత కాలంగా మైనర్ బాలుడికి(17) పాఠాలు చెబుతోంది. కానీ టీచర్‌ తో అతడు ప్రేమలో పడ్డాడు. ఆ విషయం తెలిసి బాలుడిని టీచర్ దూరంగా పెట్టింది. దీంతో ఆమెపై అతడు పగ పెంచుకున్నాడు.

ఆమె పేరు మీద ఆన్‌లైన్ డెలివరీ ఆర్డర్లు 77 సార్లు చేయడంతో పాటు ఊబర్ రైడ్స్ బుక్ చేశాడు. ఆర్డర్స్ వచ్చేవారితో చెప్పలేక ఆ కుటుంబం ఇబ్బందులు ఎదుర్కొంది. వెంటనే టీచర్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి ఈ మెయిల్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. వెంటనే అతడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా మానసిక పరిస్థితి బాగోలేదని కౌన్సిలింగ్ ఇవ్వాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News