Sunday, December 22, 2024

నారా చంద్రబాబు బాటలోనే ఇప్పుడు స్టాలిన్ సలహా

- Advertisement -
- Advertisement -

చెన్నై: దక్షిణ భారత దేశంలో జనాభా తగ్గిపోతుండడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎక్కువ మంది పిల్లలను కనమని ఇటీవలే అన్నారు. కాగా ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె.స్టాలిన్ సైతం ఎక్కువ మంది పిల్లలను కనమని సోమవారం ప్రజలను కోరారు. చెన్నైలోని తిరువాన్మయూర్ లో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘16 మందిని కని వర్ధిల్లండి’’ అన్నది పాత తమిళ నానుడిని పలికి ఆయన తన ఉపన్యాసాన్ని మొదలెట్టారు.

‘‘సంతానం భాగ్యం కాకపోవచ్చునేమో కొందరికి, కానీ మన జనాభా తగ్గిపోతే పార్లమెంటులో మన ప్రాతినిధ్య శాతం కూడా తగ్గిపోగలదు. మనకు మాత్రమే చిన్న కుటుంబం ఎందుకు? అనేది ప్రశ్న. మనమెందుకు 16 మందిని కనకూడదు? ఆ విషయాన్ని,  దేశంలో జరుతున్నదానిని మనం మరచిపోకూడదు’’ అని ఆయన తన ఉపన్యాసంలో జనులకు బోధించారు.

ఓ పరిశోధన ప్రకారం 2026 నాటికి పరిమతిని ఎత్తేస్తే(డీలిమిటేషన్) లోక్సభలో ఉత్తర భారత దేశ రాష్ట్రాలకు 32 సీట్లు, దక్షిణ భారత దేశ రాష్ట్రాలకు 24 సీట్ల చొప్పున ఉంటాయి. నియోజకవర్గాలు కూడా తగ్గిపోతాయి.  ఇందు కోసమైనా దక్షిణ భారత దేశంలో ఎక్కువ సంతానం కనాలి అన్నది వారి ఆలోచన. కానీ తిండి, బట్ట, చదువు,నీడలకు ఏర్పాట్లేమిటనేది మాత్రం ఎవరూ ఆలోచించడంలేదన్నది కొందరి వాదన. అన్ని సక్రమంగా ఉంటే నవ తరాన్ని తయారు చేయడం మనవాళ్లకేమి చేతకాదా?…

ఒక రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతం లేదా జాతీయ స్థాయిలో జనాభా మార్పులను ప్రతిబింబించేలా నిర్వహించే ప్రక్రియలో తమిళనాడు, కేరళ రాష్ట్రాలు కలిసి 16 సీట్లను కోల్పోతాయని ‘భారత్‌లో ఎమర్జింగ్ క్రైసిస్ ఆఫ్ రిప్రజెంటేషన్’ అనే అధ్యయనం పేర్కొంది.

డీలిమిటేషన్ ప్రక్రియపై డిఎంకె నేత ఆందోళన వ్యక్తం చేయడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది ఫిబ్రవరి 14న డిఎంకె నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం డీలిమిటేషన్ , ‘ఒకే దేశం ఒకే ఎన్నిక’కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసింది.

“మేము ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణించబడటానికి నిరాకరిస్తున్నాము , ఏకగ్రీవంగా రెండు తీర్మానాలను ఆమోదించాము: ఒకటి మా రాష్ట్రాన్ని అన్యాయమైన డీలిమిటేషన్ ఎక్సర్ సైజు నుండి రక్షించడం, మా సామాజిక-ఆర్థిక పురోగతి , విజయవంతమైన జనాభా నియంత్రణ చర్యలకు మేము శిక్షించబడకుండా చూసుకోవడం;  మరొకటి అప్రజాస్వామిక [‘ఒక దేశం ఒక ఎన్నికలు’] ఫాంటసీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఇది మన వైవిధ్యమైన ప్రజాస్వామ్యం యొక్క ఆకృతిని దెబ్బతీయనున్నది ”అని స్టాలిన్ జోడించారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News