Monday, December 23, 2024

సిఎం కెసిఆర్‌ కు శుభాకాంక్షలు తెలిపిన తమిళనాడు సిఎం స్టాలిన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌కు తమిళనాడు సిఎం ఎంకె స్టాలిన్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజున 125 అడుగుల ఎత్తులో ఆయన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన కెసిఆర్‌కు స్టాలిన్ అభినందనలు తెలిపారు. అంబేద్కర్ విగ్రహాన్ని అటు బుద్ధ విగ్రహానికి, ఇటు తెలంగాణ నూతన సచివాలయానికి మధ్య ఏర్పాటు చేయడం అద్భుతమని స్టాలిన్ ప్రశంసించారు.

హుస్సేన్ సాగర్ తీరాన 125 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన బిఆర్ ఆంబేద్కర్ విగ్రహాన్ని ప్రకాశ్ అంబేద్కర్‌తో కలిసి సిఎం కెసిఆర్ శుక్రవారం ఆవిష్కరించిన సంగతి విదితమే. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి తెలంగాణ నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలకు చెందిన దళిత నాయకులు, ప్రజలు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News