Sunday, December 22, 2024

ప్రధాని మోడీపై తమిళనాడు సిఎం స్టాలిన్ అనుచిత వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

చెన్నై: ప్రధాని నరేంద్ర మోడీపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ తమ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.  మంగళవారం ఆయన తూత్తుకుడి కూరగాయల మార్కెట్లో, మత్స్యకారుల కాలనీలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దేశం ప్రశాంతంగా ఉండాలంటే ప్రధాని మోడీ తిరిగి అధికారంలోకి రాకుండా చేయాలన్నారు. మోడీ మళ్లీ ప్రధాని అయితే దేశం మొత్తం అల్లర్లతో అట్టుడుకగలదన్నారు. మోడీని తిరిగి  అధికారంలోకి రాకుండా చేయగలిగే శక్తి తమిళనాడు ప్రజల చేతుల్లో ఉందన్నారు. బిజెపి గెలిస్తే సమాజంలో విష బీజాలు నాటగలదన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News