Monday, December 23, 2024

సివిల్ సర్వీస్ అభ్యర్థులకు మరో అవకాశం ఇవ్వాలి

- Advertisement -
- Advertisement -

చెన్నై : సివిల్ సర్వీస్ అభ్యర్థుల విన్నపాలను పరిగణన లోకి తీసుకొని, వాళ్లకు మరో అవకాశమివ్వాలని ప్రధాని మోడీని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ కోరారు. కరోనా పరిస్థితుల కారణంగా చాలా మంది అభ్యర్థులు పరీక్ష రాయలేక పోయారని, చివరి అవకాశాన్నీ కోల్పోయిన వారున్నారని అన్నారు. అలాంటి వాళ్ల అభ్యర్థనను స్వీకరించి వయోపరిమితిని పెంచుతూ మరోసారి పరీక్ష రాసేందుకు అనుమతించాలని కోరారు.

ఈ మేరకు ప్రధానికి ఆయన లేఖ రాశారు. చివరి అవకాశం కోల్పోయిన అభ్యర్థులందరికీ మరోసారి పరీక్ష నిర్వహించే అంశాన్ని పరిశీలించాలంటూ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ కూడా సిఫార్సు చేసిందన్న విషయాన్ని స్టాలిన్ తన లేఖలో ప్రస్తావించారు. వివిధ పార్టీల నుంచి దాదాపు 150 మందికి పైగా ఎంపీలు మద్దతు తెలిపారని అన్నారు. రాష్ట్ర పరిధిలో నిర్వహించే ఉన్నత సర్వీస్ పరీక్షల్లో అభ్యర్థుల వయోపరిమితిని రెండేళ్ల పాటు పెంచుతూ తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్టు లేఖలో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News