- Advertisement -
విల్లుపురం: లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెన్షన్‌లో ఉన్న తమిళనాడుకు చెందిన ఐపిఎస్ అధికారి రాజేష్ దాస్‌ను దోషిగా దిగువ కోర్టు తేల్చింది. దాస్‌కు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ విల్లుపురంలోని చీఫ్ జుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది.
2021లో ప్రత్యేక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు(శాంతి భద్రతలు)గా పనిచేస్తున్న రాజేష్ దాస్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అప్పటి మహిళా సూపరింటెండెట్ ఆఫ్ పోలీసు ఆరోపించారు. సస్పెండ్ చేయడానికి ముందు తమిళనాడు ప్రభుత్వం దాస్‌ను కంల్సరీ వెయిట్‌లో ఉంచడంతోపాటు డౌన్‌గ్రేడ్ చేసింది. శిక్షపైకోర్టులో అప్పీలు చేసుకోవడానికి అనుమతినిస్తూ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
- Advertisement -