- Advertisement -
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం భార్య విజయలక్ష్మి(63) బుధవారం ఉదయం కన్నుమూశారు. కొన్ని రోజులు ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతోందని, ఆమె గుండె పోటు రావడంతో తుదిశ్వాస విడిచిందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. అన్నాడిఎంకె నేతలు, రాజకీయ ప్రముఖులు ఆమె మృతి పట్ల సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పన్నీరు సెల్వం ఇంటికి వెళ్లి మృతదేహానికి నివాళులర్పించి పరామర్శించారు.
- Advertisement -