Monday, December 23, 2024

ఇడి సమన్లను సవాలు చేస్తూ తమిళనాడు వ్యాజ్యం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మనీల్యాండరింగ్ కేసులో ఇడి దర్యాప్తుకు వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వం మద్రాస్ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేయడంపై సుప్రీం కోర్టు ప్రశ్నించింది. అక్రమంగా ఇసుక మైనింగ్ కేసులో దర్యాప్తు కోసం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) వెల్లూరు, తిరుచిరాపల్లి, కరూర్, తంజావూరు, అరియలూరు జిల్లా కలెక్టర్లకు సమన్లు జారీ చేసింది. ఈ సమన్లపై స్టే విధించేలా అధికారులతోపాటు రాష్ట్ర ప్రభుత్వం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ స్టే ఉత్తర్వులపై ఈడీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీం కోర్టు విచారణకు హాజరైన న్యాయవాదిని సుప్రీం ప్రశ్నించింది. ఏ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ పిటిషన్‌ను దాఖలు చేసిందని ప్రశ్నించింది.

అధికారులు ఈడీకి సహకరించాలని సుప్రీం కోర్టు ధర్మాసనం సూచించింది. ఈడీ అక్రమ దర్యాప్తు నుంచి అధికారులను రక్షించుకోడానికి తమిళనాడు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాదులు ముకుల్ రోహ్‌త్గీ, అమిత్ ఆనంద్ తివారీ వివరించారు. జిల్లా యంత్రాంగం నుంచి సేకరించిన ఏ సమాచారంతో తదుపరి విచారణ ఎలా సాగించవచ్చునో అన్న ధోరణిలో ఈడీ సాహసం చేస్తోందని సమన్లపై స్టే విధిస్తూ మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది. అయితే ఈడీ తరఫున హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్‌విరాజు జిల్లా కలెక్టర్లు నిందితులుగా పరిగణన లోకి రారని, సాక్షులుగా మాత్రమే ఉంటారని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News