Wednesday, January 22, 2025

ప్రజ్ఞానందకు రూ.30 లక్షల నజరానా..

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఇటీవల జరిగిన ఫిడె ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్‌లో రన్నరప్‌గా నిలిచి చరిత్ర సృష్టించి న భారత యువ సంచలనం రమేశ్‌బాబు ప్రజ్ఞానందకు తమిళనాడు ప్రభుత్వం భారీ నగదు బ హుమతిని ప్రకటించింది. అజర్‌బైజాన్ నుంచి ప్రజ్ఞానంద బుధవారం చెన్నై చేరుకున్నాడు. అతనికి తమిళనాడు ప్రభుత్వం తరఫున ఘన స్వాగ తం లభించింది.

అనంతరం ప్రజ్ఞానంద తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను ముర్యాద పూర్వకంగా కలుసుకున్నాడు. చెస్ సంచలనం ప్రజ్ఞానందను సిఎం స్టాలిన్ ఘనంగా సన్మానించారు. అంతేగాక అతనికి రూ.30 లక్షల నగదు బహుమతిని ప్రకటించారు. ఈ మేరకు దీనికి సంబంధించిన చెక్కును ప్రజ్ఞానందకు బహూకరించారు.

Also Read: తొలి రెండు మ్యాచ్‌లకు రాహుల్ దూరం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News