Sunday, January 12, 2025

తమిళనాడులో దంచి కొడుతున్న వర్షం.. విద్యాసంస్థలకు సెలవు

- Advertisement -
- Advertisement -

తమిళనాడులో వర్షం దంచి కొడుతోంది. కుండపోత వానలు కురుస్తుండటంతో చెన్నైలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం కారణంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు భారత వాతావరణ విభాగం(IMD) భారీ వర్షపాతం హెచ్చరిక జారీ చేసింది. రానున్న రెండు రోజులపాటు చెన్నైతోపాటు విల్లుపురం, తంజావూరు, మైలదుత్తురై, పుదుక్కోట్టై, కడలూరు, దిండిగల్, రామనాథపురం, తిరువారూర్, రాణిపేట్, తిరువళ్లూరు జిల్లాల్లో వర్షాలు పడతాయని ఐఎండీ ఆరెంజ్‌ అలెర్ట్ జారీ చేసింది. దీంతో గురువారం ఈ జిల్లాల్లో పాఠశాలలకు తమిళనాడు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

పుదుచ్చేరి, కారైకాల్ అంతటా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. అరియలూర్, తంజావూరు, తిరువారూర్, పుదుక్కోట్టై జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD అంచనా వేసింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడా వానలు పడే చాన్స్ ఉందని తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News