Monday, December 23, 2024

తుపాన్ నష్టం..రూ.5060 కోట్ల కేంద్ర సాయం కోరిన స్టాలిన్

- Advertisement -
- Advertisement -

చెన్నై : మిచౌంగ్ తుపాన్ బీభత్సంతో తమిళనాడు లోని చెన్నై, తిరువల్లూరు, కాంచీపురం, చెంగల్పట్టులకు అపార నష్టం సంభవించిందని ఈ ప్రాంతాలను ఆదుకోడానికి తక్షణం రూ.5060 కోట్ల మేరకు తాత్కాలిక సహాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అభ్యర్థించారు. ఎడతెరిపి లేని భారీ వర్షాలతో ఈ నాలుగు జిల్లాల్లో ముఖ్యంగా గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ ఏరియా రోడ్లు, బ్రిడ్జిలు, ప్రభుత్వ భవనాలు, ఇతర సౌకర్యాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయని వివరించారు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖనుబుధవారం విడుదల చేశారు. అపారమైన ఈ నష్టాలపై సమీక్ష ప్రారంభమైందని, ఈ ప్రభావంపై సవివరంగా పూర్తి నివేదిక పంపిన తరువాత అదనంగా ఆర్థిక సాయం అందించాలని అభ్యర్థించారు. తుపాన్‌కు దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించడానికి కేంద్ర బృందాన్ని పంపాలని కోరారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News