- Advertisement -
చెన్నై: తమిళనాడులో త్వరలో బ్రాహ్మణేతర పూజార్లు నియామకం కానున్నారు. దీనికి అనుగుణంగా వంద రోజుల శైవ అర్చక్ కోర్సును ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనున్నది. ఈ కోర్సును పూర్తి చేసేవారికి పూజారిగా నియామకానికి అర్హత లభిస్తుంది. తమిళనాడు హిందూమత చారిటబుల్ ఎండోమెంట్ విభాగం (హెచ్ ఆర్ అండ్ సీఈ) పరిధి లోని 36,000 ఆలయాల్లో ఈ పూజార్ల నియామకం జరుగుతుంది. దాదాపు వందమంది బ్రాహ్మణేతర పూజార్ల మొదటి జాబితా కొద్ది రోజుల్లో విడుదల కానున్నది. దీనిపై రాజకీయ రంగు పులుముకోవడంతో డిఎంకె హిందూ వ్యతిరేక ఆలోచనలతో ఉంటోందని బిజెపి తీవ్రంగా వ్యతిరేకించింది.
- Advertisement -