Monday, December 23, 2024

తెలంగాణ హరితహారంపై తమిళనాడు ఐఎఎస్ అధికారిణి ప్రశంసల వర్షం

- Advertisement -
- Advertisement -

 

న్యూస్‌డెస్క్: తెలంగాణలో సామాజిక అడవుల పెంపకం కోసం ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు నాయకత్వంలో చేపట్టిన హరిత హారం కార్యక్రమానికి తమిళనాడుకు చెందిన మహిళా ఐఎఎస్ అధికారి సుప్రియా సాహు నుంచి ప్రశంసలు లభించాయి. తమిళనాడు ప్రభుత్వంలోని వాతావరణ మార్పు, అటవీ శాఖలో అదనపు చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్న సుప్రియ సాహు ఇటీవల తెలంగాణలో హరిత హారం ప్రాజెక్టును ఫీల్డ్ విజిట్ చేశారు.

ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరిత హారం కార్యక్రమంపై ఆమె ప్రశంసల జల్లు కురిపించారు. పచ్చదనం పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల గురించి విని తాను క్షేత్ర సందర్శన చేసినట్లు సుప్రియా సాహు ట్వీట్ చేశారు. నర్సరీలను చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారని, వీటిలో పెంచుతున్న పెద్ద మొక్కలు చాలా అందంగా ఉన్నాయని ఆమె తెలిపారు. హరిత వనంగా తెలంగాణను తీర్చిదిద్దే అందుకు చేపట్టిన చర్యలను ఆమె అభినందించారు. తన సందర్శనకు సంబంధించిన వీడియోలను కూడా ఆమె పోస్ట్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News