- Advertisement -
చెన్నై: కరోనా విజృంభిస్తున్న వేళ తమిళనాడు సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారిని కట్టడిచేసేందుకు అమల్లో ఉన్న లాక్‌డౌన్ ను జూన్ 7 వరకూ పొడిగించనున్నట్లు శుక్రవారం తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె స్టాలిన్ ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న లాక్‌డౌన్ కు ఎలాంటి సడలింపులుండవని ప్రభుత్వం తెలిపింది. జూన్ ఏడు వరకూ ఇవే నిబంధనలు కొనసాగుతాయని సిఎం స్టాలిన్ వెల్లడించారు. స్థానిక సంస్థల అనుమతితో ఆయా ప్రాంతాల్లో వాహనాల ద్వారా అవసరమైన సామాగ్రిని విక్రయించడానికి ప్రొవిజన్ స్టోర్లను అనుమతిస్తామని స్టాలిన్ ప్రకటించారు. రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు 13 రకాల నిత్యావసర వస్తువులతో కూడిన కిట్ ను అందచేస్తామన్నారు. లాక్‌డౌన్ లో కోవిడ్-19 కేసులు తగ్గిన పూర్తి సంతృప్తికరమైన ఫలితాలు రాలేదని స్టాలిన్ చెప్పారు.
Tamil Nadu lockdown extended
- Advertisement -