Monday, December 23, 2024

తమిళనాడులో దారుణం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తమిళనాడులో దారుణ ఘటన చోటు చేసుకుంది.. నామక్కల్ జిల్లా పళ్లిపాలయానికి చెందిన ఓ వ్యక్తి ఈనెల 18 అతను ఓ రోగిని హత్య చేసినట్లు వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది కాస్తా వైరల్ గా మారింది. వివరాలలోకి వెళితే.. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. పళ్లిసాలయానికి చెందిన వ్యక్తి స్థానికంగా ఉండే ప్రభుత్వాసుపత్రిలో ముసలి వాళ్లను , ఆరోగ్యం బాగోలేని వాళ్లను వారి కుటుంబ సభ్యుల కోరిక మేరకు విషపు ఇంజక్షన్ ఇచ్చి హత్య చేసేవాడు.

ఇందుకు గాను రూ. 5వేలు తీసుకునేవాడు. అయితే ఈ నెల 18న మద్యం మత్తులో రూ. 5 వేలు ఇస్తే రెండు నిమిషాల్లో పని పూర్తి చేస్తా, గత పది సంవత్సరాలుగా 300 మందికి పైగా రోగులను హత్య చేసినట్లు ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ విషయం కాస్తా పళ్లిపాలయం పోలీసులకు తెలిసింది. దీంతో పోలీసులు నిందితుడు మోహన్ రాజ్ ను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Also Read: జోరు మీదున్న ముంబై.. నేడు పంజాబ్‌తో కీలక పోరు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News