- Advertisement -
చెన్నై : మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన మంత్రి సెంధిల్ బాలాజీ తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించగా మద్రాస్ హైకోర్టు తిరస్కరించింది. గురువారం వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జయచంద్రన్ బెయిల్ పిటిషన్‌ను తోసి పుచ్చారు. ఇప్పటికే పిటిషనర్ సోదరుడు పరారీలో ఉండడం, బెయిల్ ఇస్తే బాలాజీ సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలు కూడా ఉండడంతో చివరకు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేసింది.
గతంలో అన్నాడిఎంకే హయాంలో రవాణా శాఖ మంత్రిగా ఉన్న సెంథిల్ బాలాజీ , ఆ సమయంలో ఉద్యోగాల విషయంలో నగదు కుంభకోణానికి పాల్పడ్డారని ఆయనపై ఆరోపణలున్నాయి. ఈ కుంభకోణంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసుకు సంబంధించి జూన్ 14 న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బాలాజీని అరెస్టు చేసింది.
- Advertisement -