Monday, December 23, 2024

రుద్రేశ్వర ఆలయంలో తమిళనాడు ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

- Advertisement -
- Advertisement -

సుబేదారి: శ్రీరుద్రేశ్వర ఆలయంలో తమిళనాడు రాష్ట్రంలోని మోదుక్కురిచి ఎమ్మెల్యే డాక్టర్ సీకే సరస్వతి మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే ప్రవాస యోజన కార్యక్రమంలో భాగంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో పర్యటిస్తున్న తమిళనాడు రాష్ట్రం మోదుక్కురిచి ఎమ్మెల్యే డాక్టర్ సీకే సరస్వతి వికాస్ తీర్థ్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం హన్మకొండలోని సుప్రసిద్ద రుద్రేశ్వరస్వామి వెయ్యి స్తంభాల తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది. ఎమ్మెల్యే సరస్వతికి ఆలయ పూజారులు స్వాగతం పలికారు.

అనంతరం బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ వెయ్యి స్తంభాల గుడిలో దాదాపు రూ. 15 కోట్లతో కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి పనులను చేస్తుందన్నారు. ఈ పనులను స్థానిక అధికారులతో కలిసి ఎమ్మెల్యే సరస్వతి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ నాయకులు తోపుచెర్ల అర్చన మధుసూదన్, యువమోర్చా అధ్యక్షుడు తీగల భరత్‌గౌడ్, ఆర్కియాలజీ అధికారులు మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News