Sunday, December 22, 2024

ప్రేమకు అడ్డుగా ఉన్నారని చికెన్ ప్రైడ్ రైస్ లో విషం పెట్టడంతో తల్లి, తాత మృతి

- Advertisement -
- Advertisement -

చెన్నై: యువతి ప్రేమకు కుటుంబ సభ్యులు అడ్డుగా ఉండడంతో చికెన్ బిర్యానీలో విషం కలిపి కూతురు పెట్టింది. దీంతో తల్లి, తాత బిర్యానీ తిని మృతి చెందిన సంఘటన తమిళనాడులోని నామక్కల్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. ఎరుమపట్టి ప్రాంతంలోని దేవరాయపురంలో భగవతి అనే యువతి తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటుంది. భగవతి(20) అనే ఇంజినీరింగ్ విద్యార్థిని ఓ యువకుడిని ప్రేమించింది. అతడి పెళ్లి చేసుకుంటానని ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్పింది. ఆమె ప్రేమ పెళ్లికి కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో వారిపై ఆమె పగ పెంచుకుంది. కుటుంబ సభ్యులు బతికి ఉండగా తాన ప్రేమ పెళ్లి చేసుకోలేనని నిర్ణయం తీసుకుంది. నామక్కల్ బస్టాండు సమీపంలో జీవానందం అనే(32) యువకుడు రెస్టారెంట్ నిర్వహిస్తున్నాడు.

అతడి రెస్టారెంట్ నుంచి భగవతి ఏప్రిల్ 30న ఏడు ప్యాకెట్ల చికెన్ ప్రైడ్ రైస్ తీసుకొని ఇంటికి వెళ్లింది. ఇంట్లో తాత షణ్ముగనాథన్(67), తల్లి నదియా(40) ఉండడంతో చికెన్ ప్రైడ్ రైస్ తిన్నారు. తిన్న కొంచెం సేపటికే వారు అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తరలించారు. వాళ్ల పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రిలోని ఐసియూలో చికిత్స పొందుతూ మే 2న తాత, మే 3న తల్లి మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి చికెన్ ప్రైడ్ రైస్ ను పరీక్షలకు పంపగా విషం ఉన్నట్లు తేలింది. రెస్టారెంట్ యజమాని జీవానందంతో పాటు భగవతిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే చేశానని యువతి ఒప్పుకుంది. జీవానందాన్ని పోలీసులు విడిచిపెట్టి ఆమెను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News