Sunday, December 29, 2024

బస్సును ఢీకొట్టిన కారు: ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

చెన్నై: తమిళనాడు రాష్ట్రం రామనాథపురం సమీపంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న ఆర్‌టిసి బస్సును కారు ఢీకొనడంతో  ఐదుగురు ఘటనా స్థలంలోనే చనిపోయారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను రామనాథపురం ఆస్పత్రికి తరలించారు. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుడికి వాంతులు రావడంతో బస్సును ఆర్‌టిసి డ్రైవర్ పక్కకు ఆపాడు. అతివేగంతో వచ్చిన కారు అదుపుతప్పి బస్సును ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన ప్రణవిక, రాజేశ్, దర్శిలరాణి, సెంథిల్, ఈశ్వరిలు మృతి చెందారు. మృతులలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News