Wednesday, January 22, 2025

తక్షణ సాయంగా రూ.5,000 కోట్లు ఇవ్వండి

- Advertisement -
- Advertisement -

రాజ్యసభలో డిఎంకె నాయకుడు తిరుచ్చి శివ విజ్ఞప్తి

న్యూఢిల్లీ: మిగ్‌జాం తుపాను కారణంగా కురిసిన కుండపోత వానలకు చెన్నైతో పాటుగా తమిళనాడులోని ఇతర జిల్లాల్లో దెబ్బతిన్న మౌలికసదుపాయాల పునరుద్ధరణకు కేంద్రంనుంచి రూ.5,000 వేల కోట్ల తాత్కాలిక సాయాన్ని తమిళనాడు ప్రభుత్వం కోరింది. మంగళవారం రాజ్యసభలో జీరోఅవర్‌లో డిఎంకె నాయకుడు తిరుచ్చి శివ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ మిగ్‌జాం తుపాను కారణంగా కురిసిన భారీ వర్షాలకు చెన్నై, మరికొన్ని జిల్లాలు పూర్తిగా నీట మునిగాయని చెప్పారు. ‘ఎడతెగని వర్షపు నీటి కారణంగా రోడ్లు చెరువులయ్యాయి.

నదులు సముద్రంలాగా మారాయి, అన్ని జలాశయాలు సొంగి పంరవహిస్తున్నాయి. పలు చెరువులకు గండ్లు పడ్డాయి’ అని ఆయన చెప్పారు. ఈదురు గాలులకు పలు చోట్ల విద్యుత్ స్తంభాలు నేల కూలి విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, ముఖ్యమంత్రి, మంత్రులతో పాటుగా అన్నిశాఖల ఉద్యోగులు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగిస్తున్నారని ఆయన చెప్పారు. తమిళనాడులోని ఐదు జిల్లాల్లో నెలకొన్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తక్షణం తాత్కాలిక సాయం కింద రూ.5000 కోట్లు విడుదల చేయాలని ఆయన కేంద్రాన్ని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News