Sunday, December 22, 2024

కొత్త పోకడపోయిన మదురై మెడికల్ కాలేజీ డీన్ కు ఉద్వాసన !

- Advertisement -
- Advertisement -
Medicos oath
హిప్పోక్రాటిక్ ప్రమాణం అనేది పాశ్చాత్య ప్రపంచంలో వైద్య ఎథిక్స్ యొక్క మొట్టమొదటి వ్యక్తీకరణ; విద్యార్థులను వైద్య సంస్థలో చేర్చే వేడుకలలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది. కానీ…

చెన్నె: మదురై మెడికల్ కాలేజ్‌లో మొదటి సంవత్సరం విద్యార్థుల చేత ఇంగ్లీషు హిప్పోక్రాటిక్ ప్రమాణానికి బదులు సంస్కృతంలో మహర్షి చరక శపథ్ చేయించారు. దాంతో వివాదం చెలరేగింది. ఆ తర్వాత ఆ వైద్య కళాశాల డీన్‌ను తమిళనాడు ప్రభుత్వం ఆదివారం బదిలీ చేసింది. పైగా అతడిని ‘వెయిట్‌లిస్ట్’ లో ఉంచింది. వైద్య విద్యార్థుల ప్రమాణ ఘటన శనివారం ఆర్థిక మంత్రి పిటిఆర్ పళనివేల్ త్యాగ రాజన్ , వాణిజ్య పన్నుల శాఖ మంత్రి పి.మూర్తి సమక్షంలో జరిగింది. కాగా వారు వేదిక మీదే ఈ ప్రమాణ విధానాన్ని వ్యతిరేకించారు. పైగా కేంద్ర ప్రభుత్వం హిందీని రుద్దే కుట్రలో భాగమే ఇదని నిందించారు. దీర్ఘకాలికంగా ఉన్న సాంప్రదాయాన్ని కాదని సంస్కృతంలో ప్రమాణం చేయాలంటూ విద్యార్థులను పురమాయించారు. వైద్య కళాశాలలో ఇలా జరగడం ఇదే మొదటిసారని అధికారులు తెలిపారు. ఇదిలావుండగా సంస్కృతంలో ప్రమాణం చేసిన ఓ వైద్య విద్యార్థి తాను కుటుంబానికి చెందిన పురుషుల సమక్షంలోనే మహిళలకు వైద్య చేస్తానన్నాడు. వైద్య విద్యార్థులతో హిప్పోక్రాటిక్ ప్రమాణం చేయించడం అన్నది పాశ్చాత్య దేశాల్లో విస్తృతంగా ఆచరణలో ఉంది. భాషాపరంగా ఎంతో సున్నితమైన తమిళనాడులోనే ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడం వింత. దీనికంతటికి కారణమైన ఆ సంస్థ డీన్ ఏ రత్నవేల్‌ను తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి ఎంఏ సుబ్రమణ్యన్ బదిలీ చేశారు. పైగా అతడిని వెయిట్‌లిస్ట్‌లో పెట్టారు.

“నేను తిరువళ్లూరు, నీల్‌గిరీస్‌లోని కొన్ని కళాశాలల్లో ప్రమాణస్వీకార వేడుకలకు హాజరయ్యాను. అక్కడ విద్యార్థులు ఇంగ్లీషులోనే హిప్పోక్రాటిక్ ప్రమాణం చేశారు. తమిళనాడులో అదే ఆచరణలో ఉంది. అయితే ఆచరణలను మార్చే అధికారం ఎవరికైనా ఎవరిచ్చారు? అసలు ఎలా పలకాలో కూడా తెలియని భాషలో ప్రమాణాన్ని విద్యార్థులతో చేయించడం ఏమిటి?” అంటూ సుబ్రమణ్యన్ ఈ సందర్భంగా ప్రశ్నించారు. మహర్షి చరక్ శపథ్‌ను జాతీయ వైద్య కమిషన్ ఏప్రిల్ ఆరంభంలో చేర్చిందని భావిస్తున్నారు. అయితే దీనిపై ఎలాంటి రాతపూర్వక కమ్యూనికేషన్ లేదని అధికారులు అంటున్నారు. నేషనల్ మెడికల్ కమిషన్ గానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి గాని ఎలాంటి రాతపూర్వక కమ్యూనికేషన్ లేదని తెలుస్తోంది.

మాజీ కేంద్ర ఆరోగ్య మంత్రి అన్బుమణి రామదాస్ మాట్లాడుతూ, హిప్పోక్రాటిక్ ప్రమాణం వైద్యులకు… వారి రోగులకు ఆశను అందించడాన్ని నేర్పుతుంది… ఆప్యాయత, నిజాయితీ , దయ వంటి లక్షణాలను కలిగి ఉండాలని నొక్కి చెబుతుంది. “అయితే, భారతీయ ఆయుర్వేద వ్యవస్థ చక్రవర్తిచే ద్వేషించబడిన వ్యక్తులకు లేదా చక్రవర్తిని ద్వేషించేవారికి చికిత్స చేయరాదని చెబుతుంది. వితంతువులకు చికిత్స చేయరాదని కూడా చెబుతోంది. వైద్యులు ప్రాచీనకాలపు ఆలోచనలతో ఉన్న భాష్యాల ఆధారంగా ప్రమాణం చేయకూడదు.’’ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News