Sunday, January 19, 2025

సిబిఐకి తమిళనాడులో నో ఎంట్రీ

- Advertisement -
- Advertisement -

చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో కేంద్రదర్యాప్తు సంస్థ సిబిఐ ప్రవేశానికి వీలు లేకుండా రాష్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఏ కేసులోనైనా దర్యాప్తు చేసుకునేందుకు గతంలో సిబిఐకి ఇచ్చిన అనుమతిని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. దీంతో ఇకనుంచి రాష్ట్రంలో ఏ కేసునైనా సిబిఐ దర్యాప్తు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. తమిళనాడు మంత్రి వి. సెంథిల్ బాలాజీని మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్టు చేసిన కొన్ని గంటల్లోనే డిఎంకె ప్రభుత్వం

ఈ నిర్ణయం తీసుకోవడం గమనించ దగిన విషయం. కేంద్ర ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగం చేస్తోందంటూ దేశం లోని తొమ్మిది రాష్ట్రాలు సిబిఐకి జనరల్ కన్సెంట్‌ను ఉపసంహరించుకున్నాయి. ఆ జాబితాలో తెలంగాణ, పశ్చిమబెంగాల్ ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, కేరళ, ఝార్ఖండ్, పంజాబ్, మేఘాలయ, మిజోరం రాష్ట్రాలు ఉండగా, తాజాగా తమిళనాడు చేరినట్టు అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News