Thursday, December 12, 2024

బస్సు డ్రైవర్‌ను పట్టపగలే నడిరోడ్డుపై నరికి చంపారు…. వీడియో వైరల్

- Advertisement -
- Advertisement -

చెన్నై: పట్టపగలు నడి రోడ్డుపై బస్సు డ్రైవర్‌ను నరికి చంపారు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రం తాంజావూరులో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. అయ్యమ్ పెట్టాయ్ ప్రాంతంలో డ్రైవర్ శివ బస్సు ఆపి విరామం కోసం కండక్టర్‌తో కలిసి టీ తాగడానికి రోడ్డుపక్కకు వెళ్లారు. డ్రైవర్ రోడ్డు దాటుతుండగా ముగ్గురు వ్యక్తులు ముఖానికి మాస్కులు ధరించి బైక్‌పై వచ్చి డ్రైవర్‌పై కత్తులతో దాడి చేశారు. నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగానే కత్తులతో డ్రైవర్ ను నరికి చంపిన అనంతరం వారు పారిపోయారు. మర్డర్ చూసిన ప్రత్యక్ష సాక్షులు భయంతో వణికపోయారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతుడు పాపన్ శ్యామ్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.

curtsy by Times now

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News